చిత్తూరు జిల్లాలో ముగియనున్న మండల జిల్లా పరిషత్తుల పాలకవర్గాల పదవీకాలం
రిపోర్టర్: సురేష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మండల, జిల్లా పరిషత్తు పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఎంపీపీలు, ఎంపీటీసీల పదవులు బుధవారంతో, జడ్పీ ఛైర్మన్, జడ్పీటీసీల కాలం గురువారంతో ముగియనున్నాయి. ఈనెల 25 నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుండగా, జడ్పీకి కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రత్యేకాధికారిగా వ్యవహరించనున్నారు.