ట్రైసిటీలో భారీ వర్షాల బీభత్సం: లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: గోపి స్థలం: Warangal

అర్నబ్ తుఫాను ప్రభావంతో వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అకస్మాత్తుగా ప్రారంభమైన ఈ భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈ వర్షం మరో రెండు గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.