నగ్న వీడియోలతో విదేశీ మహిళను బెదిరించిన జ్యోతిష్కుడు అరెస్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: చెన్నై
చెన్నైలో కెనడా మహిళను నగ్నంగా పూజలు చేయమని నమ్మించి, ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన జ్యోతిష్కుడు ఇసక్కిముత్తును పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో రూ.20 వేలు వసూలు చేసిన నిందితుడు, ఆపై వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాంబలం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు.