ఇండియా కూటమిపై జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం: రాహుల్ గాంధీ తీరుపై మండిపాటు

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

దేశ రాజధానిలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకం సృష్టించేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఆయన మండిపడ్డారు. విదేశీ శక్తుల కనుసన్నల్ లో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని జేపీ నడ్డా ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు.