'భక్తిశ్రద్ధలతో ఖైరతాబాద్ గణేష్ పూజలు': కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు విఘ్నేశుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి, దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆశీస్సులు అందుకున్నారు.