దేశంలోనే సరికొత్త చరిత్ర: బుర్రిపాలెంలో వంద త్రీడీ గృహాల నిర్మాణం

రిపోర్టర్: నరేష్ స్థలం: గుంటూరు

దేశంలో తొలిసారిగా వంద త్రీడీ గృహాలు నిర్మించనున్న గ్రామంగా బుర్రిపాలెం చరిత్ర సృష్టించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పర్యటనను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.