అనకాపల్లి జిల్లాలో విషాదం నింపిన మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా మడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనే మనస్తాపంతో మైనర్ ప్రేమజంట దొంగల సత్యసాగర్, శీలా అరుణ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న వయసులోనే ఇద్దరూ ప్రాణాలు తీసుకోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.