సూర్య జ్యోతికల పెళ్లిపై హీరో కార్తీ సరదా వ్యాఖ్యలు వైరల్
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు జ్యోతికల పెళ్లిపై నటుడు కార్తీ చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. సీన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కార్తీ, స్కాట్లాండ్ లో జరిగిన వారి వో వ్యక్తిగత వేడుక గురించి ప్రస్తావించారు. వాళ్ల మధ్య ప్రేమ ఓవర్ అయిపోయిందని, ఇది చూసి చాలా మంది భార్యలు తమ భర్తలపై విరుచుకుపడుతున్నారని, తాను కూడా తిట్లు తిన్నానని కార్తీ సరదాగా నవ్వులు పూయించారు.