బీహార్ లో పదవ తరగతి విద్యార్థినిపై దుండగుల వేధింపులు
రిపోర్టర్: నరేష్
స్థలం: జమూయ్
బీహార్ రాష్ట్రం జమూయ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించి వేధించిన ఉదంతం కలకలం రేపింది. కోచింగ్ ముగించుకుని సహచర విద్యార్థితో కలిసి స్కూటర్ పై వెళ్తున్న సమయంలో మార్వా పహాడ్ ప్రాంతంలో ఈ అఘాయిత్యం జరిగింది. నిందితులు బాలికను వేధిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎస్పీ విశ్వజిత్ దయాల్ ఆదేశాల మేరకు ఎస్ఐటీని ఏర్పాటు చేసి ముగ్గురు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళా కమిషన్ తో పాటు ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.