ఒంగోలులో భారీ దోపిడీ: రెండు కేజీల బంగారంతో ఉడాయించిన దొంగలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఒంగోలు

ఒంగోలులో జరిగిన భారీ దారి దోపిడీ కలకలం సృష్టించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి నగల దుకాణాలకు బంగారం తీసుకెళ్తున్న వ్యాపారులను కొందరు వ్యక్తులు మార్గమధ్యంలో అపహరించారు. ఉపాస్ ఆస్పత్రి సమీపంలో ఆటోను అడ్డుకుని, వ్యాపారులను బలవంతంగా కారులో ఎక్కించుకుని దక్షిణ బైపాస్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిపై దాడి చేసి సుమారు రెండు కేజీల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.