కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు, అంబేద్కర్‌కు వినతిపత్రాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్య పాలనను నిరసిస్తూ కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ మోసాలపై కనువిప్పు కలగాలంటూ పలు ప్రాంతాల్లో అంబెడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.