ప్రపంచానికి భారీ ఆహార భద్రత ముప్పు తప్పదంటూ జైశంకర్ హెచ్చరిక
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూయార్క్
రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ యుద్ధాల కారణంగా రానున్న నెలల్లో ప్రపంచానికి భారీ ఆహార భద్రత ముప్పు తప్పదని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ హెచ్చరించారు. న్యూయార్క్లో జరిగిన ఆసియా సమాజం సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇంధన రంగ మార్కెట్లు కఠినంగా ఉన్నాయని, ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తే సంక్లిష్టతలు పెరుగుతాయని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పాక్ తీరును భాగస్వాములు గుర్తించకుంటే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.