ముంబయిలో ప్రధాని మోదీ భద్రతలో తీవ్ర లోపం
రిపోర్టర్: గోపి
స్థలం: మహారాష్ట్ర
ముంబయిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేదిక వద్ద తీవ్ర భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. నకిలీ పీఎంఓ ఐడీ కార్డులు, నాటు తుపాకీతో సంచరిస్తున్న రోహన్ పరేఖ్‌తో పాటు అతని బాడీగార్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని కార్యక్రమ వేదిక వద్దకు ఆయుధంతో చొరబడటానికి యత్నించిన నిందితుల ఉద్దేశంపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.