కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు: పలుచోట్ల గృహనిర్బంధాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Kadapa
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలపై కడప పోలీసులు వైఎస్సార్సీపీ నేతలపై పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గాంధీనగర్ పాఠశాల వద్ద రాళ్లదాడి మరియు వాహనాల ధ్వంసం కేసుల్లో డెబ్బై మందికి పైగా నేతలపై చర్యలు చేపట్టారు. రాయచోటిలో మంత్రి హత్య కుట్ర వ్యవహారంతో పాటు పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.