ఖమ్మంలో అడవి దున్న సంచారం: చెట్లేక్కి ప్రాణాలు కాపాడుకున్న రైతులు

రిపోర్టర్: గోపి స్థలం: Khammam

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చోడవరం గ్రామంలో మామిడి తోటలో భారీ అడవి దున్న ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా అడవి దున్న కంటపడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన రైతులు, కూలీలు ఎత్తైన చెట్లేక్కి తలదాచుకున్నట్లు వెల్లడించారు. ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చినట్లు భావిస్తున్న ఈ వన్యమృగాన్ని వెంటనే పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.