పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రచారాన్ని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాలేజీలను ప్రైవేటుపరం చేసే ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టాటా గ్రూప్‌తో ఒప్పందం ద్వారా సాంకేతిక విద్యను ఆధునీకరించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో జీవో 97ని సవరిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ యథావిధిగా కొనసాగుతుందని సీఎం భరోసానిచ్చారు.