నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో కాంగ్రెస్కు షాకిచ్చిన పలువురు నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నల్లబెల్లి
రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గూగులోతు రాజు, భూక్య శ్రీను బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.