యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ జీఎస్టీ ఆరోపణలను ఖండించిన ఎన్పీసీఐ

రిపోర్టర్: రమేష్ స్థలం: భారత్

యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ పై విధించే జీఎస్టీ చిన్న వ్యాపారులపై భారాన్ని మోపుతుందంటూ వస్తున్న ఆరోపణలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. రూ.2,000 వరకు జరిగే లావాదేవీలకు ఎండీఆర్ వర్తించదని, దీనిపై ఎలాంటి జీఎస్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అత్యధిక శాతం చిన్న లావాదేవీలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని, ఆందోళనలు నిరాధారమైనవని ఎన్పీసీఐ వెల్లడించింది.