భక్తిపారవశ్యంతో పులకించిన శ్రీ గణేష్ మహా కుంకుమ పూజ
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం చెరువు బజార్లో శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా కుంకుమ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 400 మంది మహిళా భక్తులు ఈ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాచకొండ రామ్మూర్తి, రాచకొండ బాబు దంపతులు మహా కుంకుమ పూజను సమర్పించారు. గణేష్ మహారాజు ఆశీస్సులతో దాతల కుటుంబాలకు ఆయురారోగ్యాలు కలగాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.