కలెక్టర్ తనిఖీ వేళ పాఠశాలలో కుర్చీలు మోసిన చిన్నారి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: డోర్నకల్
డోర్నకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీకి వెళ్లిన సమయంలో ఒక చిన్నారి కుర్చీలు మోస్తూ కనిపించడం విస్మయానికి గురిచేసింది. అధికారుల రాక సందర్భంగా విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ దృశ్యాన్ని చూసి కలెక్టర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు.