రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అమలుపై డైరెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందకు పైగా వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని స్వచ్ఛాంధ్ర సంస్థ ఛైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షతన జరిగిన డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. బుధవారం అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో నెట్ జీరో విధానం అమలుతో పాటు, రద్దీ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్ల పక్కన చెత్త తొలగింపునకు యంత్రాల వినియోగంపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.