ఓక్ల్యాండ్ స్కూల్స్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
VZM : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓక్ల్యాండ్ స్కూల్స్ పూసపాటిరేగ, జమ్ము శాఖల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు.ఈసందర్బంగా కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదు, అది బాధ్యత, దేశ సేవ. గౌరవం అడిగేది కాదు, మన నిబద్ధతతో సంపాదించుకోవాలని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి” అన్నారు..అనంతరం ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ రవిని ఉపాధ్యాయులు, యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులను పూలతో సత్కరించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, స్కిట్లు ప్రదర్శించి అలరించారు.