భార్యకు దూరమైన ప్రముఖ నటుడు శ్రీనాథ్ భాసి
రిపోర్టర్: రాము
స్థలం: Kerala
మలయాళ నటుడు శ్రీనాథ్ భాసి తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన నిజాలు వెల్లడించారు. 2016లో రీతు జకారియాను వివాహం చేసుకున్న ఆయన, 2024 నుండి భార్యకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ వివాహ బంధం ముగిసిందని, ప్రస్తుతం తాను తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.