పొదలకూరులో రీసర్వే పాట్లు: నిషేధిత జాబితాలో ఎలికంటిపాలెం రైతుల భూములు
రిపోర్టర్: నరేష్
స్థలం: పొదలకూరు
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన రీసర్వే పొదలకూరు మండలంలోని ఎలికంటిపాలెం గ్రామ రైతన్నలకు తీవ్ర శాపంగా మారిందని, వందలాది ఎకరాలను 22-ఏ కింద చేర్చడంతో చిన్న, సన్నకారు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ దస్త్రాల్లో భూములను ప్రభుత్వ భూమిగా చూపిస్తూ తరంకట్టిన గయ్యాళ్లు అని వర్గీకరించడంతో బ్యాంకు రుణాలు అందక, క్రయవిక్రయాలు జరగక అల్లాడిపోతున్నామని బాధితులు వాపోయారు.