పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ రవిబాబు

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలం అనాసాగరం ప్రాథమిక పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ కె.రవిబాబు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి, పాఠశాలలోని వసతులను అధికారులతో కలిసి తనిఖీ చేశారు.