అనుమతులు లేకుండా కార్ పార్కింగ్ నిర్మాణం: పిప్పా మిడిల్టన్ దంపతులకు షాక్

రిపోర్టర్: రమేష్ స్థలం: Kintbury

ముందస్తు అనుమతి లేకుండా సొంత ఎస్టేట్ లో కార్ పార్కింగ్ నిర్మించిన ప్రిన్సెస్ కేథరిన్ చెల్లెలు పిప్పా మిడిల్టన్, ఆమె భర్త జేమ్స్ మాథ్యూస్ లకు కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని వెస్ట్ బెర్క్షైర్ కౌన్సిల్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక గ్రామీణ వాతావరణానికి భంగం కలిగించేలా ఈ నిర్మాణం ఉందని, అనుమతుల కోసం వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.