శంషాబాద్లో వెల్లువెత్తుతున్న అక్రమ నిర్మాణాలు: అధికారుల మౌనంపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు, భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూట పదకొండు జీవో అమలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని వారు మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.