మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించిన న్యాయమూర్తి

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాలకు అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి కవిత అన్నారు. బుధవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఉచితంగా న్యాయ సేవలను అందిస్తామని, ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సలహాలు పొందాలని సూచించారు.