చిన్న వయసులో అద్భుతం: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిన్నారి చోటు

రిపోర్టర్: శివ స్థలం: Tirupati

తిరుపతి జిల్లాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి దర్శన హరిశివశ్రీ అసాధారణ బాల మేధావిగా గుర్తింపు పొందింది. యూకేజీ చదువుతున్న ఈ చిన్నారి ఒకేసారి ఐదు విభిన్న విభాగాల్లో తన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి, ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. వయసుకు మించిన జ్ఞాపకశక్తితో వివిధ అంశాలపై అనర్గళంగా సమాధానాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘనత సాధించిన పాపను స్థానికులు మరియు విద్యావేత్తలు ఎంతో అభినందిస్తున్నారు.