దగదర్తిలో ఘన విజయం: ఎంపీటీసీగా గెలిచిన మాలేపాటి భవాని సంబరాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దగదర్తిలో ఎంపీపీ అభ్యర్థిని, దివంగత ఆగ్రోస్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు సతీమణి భవాని ఘన విజయం సాధించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దగదర్తి ఒకటి ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఆమె, మరో ఎంపీటీసీ యాకసిరి సుజాతతో కలిసి శనివారం రాత్రి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.