సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా నాని ది ప్యారడైజ్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ లభించగా, రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నిడివితో థియేటర్లలో సందడి చేయనుంది. సెప్టెంబర్ 21న హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.