అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా స్ప్రింక్లర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల
కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులైన రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ సర్పంచుల ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామ్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.