అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల
మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు హాజరయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.