పంజాబ్లో దారుణం: దుండగుల కాల్పుల్లో ఆప్ సర్పంచ్ మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: Tarn Taran
పంజాబ్ రాష్ట్రంలోని తరణ్ తారణ్ జిల్లాలో తూత్ గ్రామానికి చెందిన ఆప్ సర్పంచ్ అశ్వనీ దేవ్గన్ను దుండగులు కాల్చి చంపినట్లు ఎస్పీ సురీందర్ లాంబా తెలిపారు. బస్ స్టాండ్ వద్దకు వెళ్లిన సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు వివరించారు.