ఇరుముడి హిట్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో భారీ ప్రచారం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా విజయం సాధించడంతో ఆయన రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్ సినిమాకు ఆయన ఏకంగా నలభై కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం మార్కెట్ అంచనాల ఆధారంగానే ఈ ప్రచారం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.