వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత కీలకమన్న ఈటల రాజేందర్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో వైద్యరంగంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వినియోగంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, వైద్య సేవల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.