యాదగిరిగుట్ట సదస్సుకు హాజరైన రామన్నపేట ఉద్యమకారులు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

యాదగిరిగుట్టలో నిర్వహించిన ఉద్యమకారుల ఫోరం తొమ్మిదవ రాష్ట్ర ఆవిర్భావ సదస్సుకు రామన్నపేట మండల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిసి సదస్సును విజయవంతం చేశారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.