యువకుడి హత్యపై లక్నోలో కేబినెట్ మంత్రి నిరసన దీక్ష.
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో వ్యాపారి వినోద్ కుమార్ సాహాని హత్యకు గురికావడంతో లక్నోలోని కేజీఎంయూ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడు తమ పార్టీ కార్యకర్త అని పేర్కొంటూ కేబినెట్ మంత్రి సంజయ్ నిషాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. పోలీసుల వైఫల్యంపై మండిపడుతూ స్థానిక ఎస్ హెచ్ ఓ తొలగింపునకు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.