రూ.55 కోట్లతో గోపవరంలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బాపట్ల
కైకలూరు మండలం గోపవరంలో రూ.55 కోట్ల వ్యయంతో కేవలం 18 నెలల్లోనే నిర్మించిన నూతన 220/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినట్లు విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మరియు స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఈ సబ్ స్టేషన్ ద్వారా ఆ ప్రాంతానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని అధికారులు స్పష్టం చేశారు.