పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
తెలంగాణలో ఎండిపోతున్న పంటలకు ప్రకృతి కరువు కాదని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. Telugu Scribe ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, కేసీఆర్ పాలనలో ఉంటే నీటి, విద్యుత్ సమస్యలు ఉండేవి కాదన్నారు. మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలి మూటల పంచాయతీల్లో బిజీగా ఉన్నారని, నల్గొండ మంత్రులు పనికిమాలిన వారిగా తయారయ్యారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.