వీల్‌చైర్‌లో తల్లిని తోసుకుంటూ మంచిర్యాల ఎమ్మెల్యే నివాసానికి కొడుకు
రిపోర్టర్: కిరణ్
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందలేదంటూ భూక్యా బుజ్జి అనే కిడ్నీ బాధితురాలిని ఆమె కుమారుడు రాజ్‌కుమార్ వీల్‌చైర్‌పై రెండు కిలోమీటర్లు తోసుకుంటూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లి నిరసన తెలిపినట్లు బాధితులు తెలిపారు. దవాఖాన సిబ్బంది స్పందించకపోగా తనపై దాడి చేశారని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎంవో శ్రీధర్, రోగికి చికిత్సలో ఎలాంటి జాప్యం జరగలేదని, కుమారుడే సెక్యూరిటీపై దాడి చేశారని వివరణ ఇచ్చారు.