ఖమ్మం జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

రిపోర్టర్: సతీష్ స్థలం: Khammam

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధరలకే బియ్యం విక్రయించాలని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ హెచ్చరించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. శ్రీనివాస తో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యావసర సంచుల పంపిణీ మరియు ధరల నియంత్రణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.