గురుకులంలో విద్యార్థినుల లైంగిక వేధింపుల ఉదంతంపై కలెక్టర్ విచారణ

రిపోర్టర్: గోపి స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చర్లపటేల్గూడెం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులను డీటీపీ ఆపరేటర్ లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బీసీ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, విచారణ నివేదిక ఆధారంగా దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.