బందరు ప్రతిష్ఠను నాశనం చేస్తున్నారంటూ పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

రిపోర్టర్: రాము స్థలం: కృష్ణా

వచ్చిన ప్రతి అవకాశాన్ని మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నామని, బందరు ప్రతిష్ఠను పెంచే లక్ష్యంతో నిరంతరం తాము పనిచేస్తుంటే మాజీ మంత్రి పేర్ని నాని బూతులు, అడ్డగోలు వైఖరితో పట్టణ గౌరవాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బందరు అభివృద్ధిని అడ్డుకునేలా కొందరు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.