పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎఫ్డిఓ హెచ్చరిక
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించడం చట్టరీత్యా నేరమని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ స్పష్టం చేశారు. ఆదివారం కార్యాలయంలో అవగాహన పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. పాలపిట్టలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.