అంతర్జాతీయంగా కలకలం: బుర్కినాఫాసోలో బ్యూటీ పోటీలపై నిషేధం విధింపు
రిపోర్టర్: గోపి
స్థలం: Ouagadougou
బుర్కినాఫాసో దేశంలో బ్యూటీ పోటీలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. సాంస్కృతిక విలువలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే యువతుల కోసం హకిలి మూస్సో పేరుతో సరికొత్త సైన్స్ పోటీలను ప్రెసిడెన్సీ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఈ సరికొత్త విధానం ద్వారా సైన్స్ రంగంలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుందని దేశాధ్యక్షుడు ఇబ్రహీం ట్రియోరే వెల్లడించారు.