కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: త్రిశూర్
కేరళలోని త్రిశూర్ జిల్లా కైపమంగళం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు, హైవేపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.