కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సన్నిధికి పోటెత్తిన విదేశీ భక్తులు

రిపోర్టర్: Bharath స్థలం: ఐరాల

ఐరాల మండలం కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని అమెరికా, జర్మనీ, రష్యా దేశాలకు చెందిన పలువురు విదేశీ భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విదేశీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు.