ఒమ్మంగిలో భారీ వర్షాలకు నీట మునిగిన వందలాది ఎకరాల పంట

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడమే ఈ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.