మీడియా రంగంలోకి అడుగుపెట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తాజాగా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. తన సరికొత్త మీడియా సంస్థకు వీఎస్ఆర్ మీడియాగా నామకరణం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అధికారిక లోగోను పంచుకున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియాను, ఆ తర్వాత పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానల్ను లాంచ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.